కలం, వనపర్తి: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే వజ్రాయుధం ఓటు హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) పిలుపునిచ్చారు. వనపర్తి (Wanaparthy) పట్టణంతో పాటు పెద్దమందడి మండలంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణను బాధ్యతగా తీసుకుని ప్రతి అర్హుడి పేరు తుది ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వనపర్తి పట్టణంలో మొత్తం 63,246 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 67 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ నమోదు పూర్తిచేశారని తెలిపారు. మిగిలిన అర్హుల నమోదును కూడా వేగంగా పూర్తి చేసి వనపర్తిని ఆదర్శ పట్టణంగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: విద్యార్థుల గొంతు గెలిచింది: మంత్రి పొన్నం
Follow Us On : WhatsApp

