కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ చేసిన పోరాటం ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని కూడా అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలోగ్గాల్సిందేనని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని ధర్మేంద్ర రాజీనామా స్పష్టం చేసిందన్నారు.
ఈ రాజీనామా విద్యార్థి లోకం నైతిక విజయం అన్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ పోరాటం అని చెప్పారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ యావత్ ప్రపంచం గమనించిందని గుర్తు చేశారు. ఇలాంటి లీకేజీ ఘటనలు జరగకుండా సమగ్రంగా చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయ పడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో కోరిన విధంగా, ఖర్గే సూచించిన మేరకు సమగ్ర చర్చ జరగాలని సూచించారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలన్న విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
Read Also: ముచ్చటగా మూడోసారి.. సీజేపీతో ముగిసిన చర్చలు
Follow Us On: X(Twitter)

