యోగా గొప్ప వారసత్వ సంపద.. రాష్ట్రస్థాయి పోటీల్లో గంగుల

కలం, కరీంనగర్ బ్యూరో : ప్రస్తుతం ఉన్న ప్రతి క్రీడకు యోగానే మూలాధారమని దాని నుండి అన్ని క్రీడలు ఉద్భవించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తెలిపారు. శనివారం విన్యాస యోగా సెంటర్ కరీంనగర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆహ్వానిత యోగా పోటీలకు గంగుల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన (Gangula Kamalakar) మాట్లాడుతూ.. యోగాకు విశిష్ట చరిత్ర ఉందని మన పూర్వీకులు అందించిన గొప్ప వారసత్వ సంపదని గంగుల తెలిపారు. ఏ క్రీడల్లోనైనా రాణించాలన్నా ప్రాథమికంగా యోగా అభ్యసించడం తప్పనిసరి అని చెప్పారు. తత్ఫలితంగా క్రీడాకారులు ఉన్నత స్థితికి ఎదుగుతారన్నారు.

యోగా అభివృద్ధికి విన్యాస యోగ కేంద్రం కృషి చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. యోగాను అభ్యసించడం ప్రతి ఇంటా తప్పనిసరి తెలిపారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో యోగా ది ముఖ్య భూమిక అని వెల్లడించారు. యోగాలో రాష్ట్రంలోనే కరీంనగర్ (Karimnagar) నంబర్ వన్ అన్నారు. అనంతరం విన్యాస యోగ కేంద్రాన్ని అతిధులు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. క్రీడాకారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ కార్పొరేటర్ జయశ్రీ, తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, యోగా విన్యాసం కేంద్ర అధ్యక్షుడు ప్రశాంత్, ఆనంద కిషోర్, జిల్లా యోగ అసోసియేషన్ కార్యదర్శి కుంటి రామకృష్ణ సాయి, సుధాంశ్ రెడ్డి, కోచ్ లు గంగాధర్, నాగార్జున, కిష్టయ్య, మల్లేశ్వరి, అశోక్, రాజు, వాణి, బీఆర్ఎస్ నాయకులు సుంకిశాల సంపత్ రావు, కర్ర సూర్య శేఖర్, జువ్వాడి రాజేశ్వర్ రావు, పెద్ది రమేష్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, జిపి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Read Also: నా సలహా మేరకే ధర్మేంద్ర రాజీనామా.. శరద్ పవార్ సంచలన స్టేట్‌మెంట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>