కలం, మెదక్ బ్యూరో : తెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న (Komuravelli) ఆలయానికి వచ్చే భక్తులకు భారీ శుభవార్త. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
కాగా, కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం, ఇటీవల వేసిన మనోహరాబాద్ – సిద్దిపేట కొత్త రైలు మార్గంలో నూతన రైల్వే స్టేషన్ సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించబడినది. కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం, సికింద్రాబాద్, సిద్దిపేట స్టేషన్ల మధ్య లో నాలుగు డెమూ సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి ఇప్పుడు కొమరవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్‌లో అదనపు స్టాప్ ఏర్పాటు చేసి, రైలును నిలపనున్నారు.
Read Also: వరంగల్ టు మహారాష్ట్ర.. రేషన్ మాఫియా మళ్లీ యాక్టివ్!
Follow Us On: X(Twitter)

