కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్పూర్, నర్సాపూర్ (జి), సారంగాపూర్ మండలాల్లో బూత్ లెవల్ సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బీఎల్ఎస్, బీఎల్ఏ తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు నమోదును వేగవంతం చేయాలని సూచించారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ మూడు మండలాల్లోని అన్ని పోలింగ్ బూత్‌లలో సమన్వయంతో పనిచేసి, ఆగస్టు 3వ తేదీలోపు 100 శాతం ఓటరు నమోదు, సవరణలు, ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేలా కృషి చేయాలని ఆయన (Kuchadi Srihari Rao) పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన వారి ఓటరు వివరాలు ఆన్లైన్లో నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లో భీమ్ రెడ్డి, అబ్దుల్ హదిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గాజుల రవి కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read Also: వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: ఎస్పీ
Follow Us On : WhatsApp

