సహకార బ్యాంకులతో మెరుగైన సేవలు: వెలిచాల రాజేందర్‌రావు

కలం, కరీంనగర్: సహకార అర్బన్ బ్యాంకులతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని.. మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Rao) అన్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, పీఐసీ సభ్యులు మడుపు మోహన్, ముక్క భాస్కర్, లక్ష్మణ్ రాజు, అలుగు విద్యాసాగర్, నాగుల సతీష్, రేగొండ సందీప్, మార్క రాజు గురువారం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్రిబ్యునల్ తీర్పు మేరకు..

ఈ నెల ఒకటో తేదీన వరంగల్ సహకార ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఎన్నికలకు ముందు ఉన్న కమిటీనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో, ఈ నెల 7న ఛైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు పీఐసీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో వెలిచాల రాజేందర్ రావును కలిశారు. అనంతరం గడ్డం విలాస్ రెడ్డి మాట్లాడుతూ.. వెలిచాల రాజేందర్‌రావు నాయకత్వంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>