బ్యాంకాక్ టు కోల్‌కతా.. 707 ప్రమాదకర తాబేళ్లు స్వాధీనం

కలం, వెబ్ డెస్క్: బ్యాంకాక్ నుంచి కోల్‌కతాలోని నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి భారత కస్టమ్స్ శాఖ అధికారులు 707 రెడ్-ఇయర్డ్ స్లైడర్ తాబేళ్లను (Red Eared Slider Turtles) స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ ఛానల్ గుండా వెళ్తున్న సమయంలో అతడి బ్యాగ్‌లో అనుమానాస్పద కదలికలు గుర్తించారు. తనిఖీ చేయగా ఈ తాబేళ్లు బయటపడ్డాయి. ప్రపంచంలో ప్రమాదకరమైన 100 ఆక్రమణ జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఈ మేరకు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దేశంలో ఎక్కడికి తరలించాలనుకున్నారు? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పెంపుడు జంతువులకు మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో ఈ తాబేళ్లను అక్రమంగా దిగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటితో 29 స్థానిక తాబేళ్ల జాతులకు తీవ్ర ముప్పుగా ఉండే ప్రమాదం ఉందని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి సాల్మొనెల్లా బ్యాక్టీరియాకు వాహకాలు కావడంతో ప్రజారోగ్యానికీ ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కస్టమ్స్ శాఖ స్వాధీనం చేసుకున్న ఈ రకమైన తాబేళ్లను తిరిగి బ్యాంకాక్‌‌కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. పాడ్ ట్యాక్సీ వచ్చేస్తోంది!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>