‘నేషన్ ఫస్ట్ ఛాలెంజ్’ సత్తా చాటిన గద్వాల్ స్టూడెంట్

కలం, జోగులాంబ​ గద్వాల్: ‘మై భారత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషన్ ఫస్ట్ ఛాలెంజ్’ (Nation First Challenge) కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్తి సత్తా చాటాడు. గద్వాల్‌లోని ఎంఎఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి రమేశ్ తన ప్రతిభతో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విద్యార్థి రమేశ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశభక్తి, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ‘మై భారత్’ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ​ఈ విజయం తమ కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ షేక్ కలంధర్ పాష తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ కలంధర్ పాష, జిల్లా యూత్ ఆఫీసర్ (DYO) కోట నాయక్, యూత్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు నాగరాజు, అనిల్, రాజేశ్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Read Also: ఉస్మాన్‌సాగర్‌లో చిలుకూరు అర్చకుల వరుణ జపం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>