అప్పటిలోగా అన్ని గురుకులాలను తనిఖీ చేయాలి.. పొన్నం ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని గురుకులాలను ఈ ఆగస్టు 30లోగా పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. ఈ మేరకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ (MJPTBCWREIS) రీజినల్ కోఆర్డినేటింగ్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీసీ గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులలపై మంత్రి ఆరా తీశారు.

నిరంతరం పర్యవేక్షించాలి..

గురుకుల విద్యాసంస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించాలని మంత్రి సూచించారు. ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (RCO) వారానికి మూడు రోజులు పర్యటించాలని.. కనీసం 6 గురుకులాలను సందర్శించాలన్నారు. ప్రధాన కార్యాలయం, జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థల మధ్య సమన్వయం కల్పించే సంధాన కర్తలుగా ఆర్‌సీవోలు వ్యవహరించాలని చెప్పారు.

భూసేకరణ వేగవంతం చేయాలి..

ఈ సందర్భంగా సొంత భవనాలు లేని గురుకుల విద్యాసంస్థలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి (Ponnam Prabhakar) ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. ఏ నియోజకవర్గానికి అనుమతి పొందిన విద్యాసంస్థ అదే నియోజకవర్గ పరిధిలో భవనాలను ఏర్పాటు చేసేలా తగు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రతి విద్యాసంస్థలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు.

మంత్రి హెచ్చరిక..

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా సైకాలజిస్ట్ లతో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. వంటశాలలు, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి నెల కనీసం 15 గురుకుల విద్యాసంస్థలను తాను, కమిషనర్, కార్యదర్శి అకస్మిక తనిఖీలు చేస్తామని.. విధుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, ఎవరైన ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: ఢిల్లీలో హైటెన్షన్.. మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ మెరుపు ధర్నా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>