కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు జనసేన (Janasena) పార్టీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కొందరు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కోడి చెరువు ప్రాంతంలో హైడ్రా (Hydraa) బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నిబంధనలకు అనుగుణంగానే నివేదిక ఇచ్చిందని జనసేన పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఫామ్‌హౌస్ వద్ద ఎలాంటి చెరువులను నాశనం చేయలేదని, సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదని, అన్ని రకాల అనుమతులు నిబంధనల ప్రకారమే ఉన్నాయని సదరు ఎంక్వైరీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చి చెప్పిందని జనసేన వెల్లడించింది.
రాజకీయ ఉనికి కోసమే కొందరు స్వయంప్రకటిత మేధావులు, తెలంగాణ జాగృతికి చెందిన నాయకులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై నిందలు వేస్తున్నారని జనసేన మండిపడింది. కేవలం గుర్తింపు కోసం ఇలాంటి ఏడుపులు మానేసి, రాష్ట్రంలో నిజంగా జరుగుతున్న భూకబ్జాలు, అక్రమ భూ దోపిడీలపై మాట్లాడితే ప్రజల్లో కనీస మనుగడ ఉంటుందని హితవు పలికింది. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా జనసేన హెచ్చరించింది.
Read Also: నీళ్లు లేవు.. సౌకర్యాలు లేవు! : JNTUH విద్యార్థుల ఆందోళన
Follow Us On : WhatsApp

