కలం, కరీంనగర్: ఆషాఢ మాసం నేపథ్యంలో కరీంనగర్ జిల్లా (Karimnagar) కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బంగారు మైసమ్మ తల్లి బోనాల (Maisamma Bonalu) వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు నారదాసు స్రవంతమ్మ- వసంత రావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారికి భక్తిపూర్వకంగా బోనాలను సమర్పించారు. ఈ ఉత్సవాల్లో సుమారు 2,000 మందికి పైగా భక్తులు పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో కాలనీవాసులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ వ్యవస్థాపకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పూలతోరణాలు, విద్యుత్ దీపాలంకరణలతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.
Read Also: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్: అర్జెంటీనాతో స్పెయిన్ తాడోపేడో!
Follow Us On: Instagram

