జడ్చర్లలో జగన్నాథ రథయాత్రకు ఘన స్వాగతం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జడ్చర్ల (Jadcherla) పట్టణంలో జగన్నాథ రథయాత్రకు ధార్మిక సంఘాల నేతలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు మధ్యాహ్నం జడ్చర్లకు చేరుకున్న జగన్నాథ రథానికి ముందుగా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా కావేరమ్మపేట ఇందిరా నగర్ సిగ్నల్ గడ్డ నేతాజీ చౌరస్తా రామ్ మందిర్ గంజ్ తదితర ప్రాంతాల గుండా ఊరేగింపు నిర్వహించారు.

జడ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ధార్మిక సంఘాలు కుల సంఘాల నేతలు అధిక సంఖ్యలో హాజరై జగన్నాథ రథాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ శివకుమార్ రవిశంకర్ జనార్దన్ రెడ్డి వంశీ చారి మేడిశెట్టి రామకృష్ణ చంద్రయ్య మహేష్ జ్యోతి చైతన్య ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>