కలం, నిర్మల్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం నర్సాపూర్ (జి), భైంసా మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, కల్పిస్తున్న వసతులు, విద్యా బోధన, మొత్తం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య, హాజరు, తదితర విషయాలను ఆరా తీశారు. రిజిస్టర్లను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
ప్రతి రోజు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం భైంసా మండలంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టును కలెక్టర్ (Collector Bhavesh Mishra) పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలు, ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, తదితర వివరాలను అధికారులను అడిగారు. త్రాగు నీటి సరఫరాకు సంబంధించి అంశాలను సమీక్షించారు. భవిష్యత్ ప్రణాళికల ప్రకారం నీటి నిర్వహణ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఈఓ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
Read Also: బీసీ కమిషన్ భేటీ.. సర్కార్‌కు కీలక ప్రతిపాదన!
Follow Us On : WhatsApp

