భూ రీ-సర్వే పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన భూ రీ-సర్వే పనులను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొలి దశలో ధర్మసాగర్, ముచ్చర్ల మండలాల జానకిపురం గ్రామాల్లో ఈ నెలాఖరులోగా రీ-సర్వే పూర్తి చేయాలని సూచించారు.

రెండో దశలో ఎంపిక చేసిన 71 గ్రామాల్లో పనులను వేగవంతం చేయాలని, సర్వేకు ముందు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైతే సెలవు రోజుల్లో కూడా సర్వే నిర్వహించి, లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు వినియోగించాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రవి, హనుమకొండ పరకాల ఆర్డీవోలు వెంకటేష్, వెంకన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>