బైక్‌కు నిప్పు.. మల్లాపురం తండాలో కలకలం

కలం, జోగులాంబ గద్వాల్: జిల్లాలోని (Jogulamba Gadwal) కేటీ దొడ్డి మండలం మల్లాపురం తండాకు చెందిన మూడావత్ బాసు నాయక్ బైక్‌‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోయింది. బాధితుడు శుక్రవారం కేటిదొడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐ పి.శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లాపురం చెందిన బాసు నాయక్ గురువారం రాత్రి తన బైక్‌ను (TS 33 G 6945) ఎప్పటిలాగే ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌కు నిప్పు పెట్టారు. బైక్ కాలిపోతుండటం గమనించిన వెంకన్న నాయక్, బాసు నాయక్‌కు సమాచారం అందించాడు. అప్పటికే బైక్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>