వరంగల్ సీపీతో కడియం నేతల భేటీ..

కలం, హనుమకొండ :  వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kadiyam Kavya), స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతను (Warangal CP Swetha) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవల అందజేత, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రజాప్రతినిధులు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజా భద్రత, సంక్షేమం కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>