జోగులాంబ జిల్లాలో వర్షాలు.. అన్నదాతల్లో ఆనందం

​కలం, జోగులాంబ గద్వాల్: గత కొంతకాలంగా వర్షభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న జిల్లా రైతులకు ఊరట లభించింది. శుక్రవారం జోగులాంబ గద్వాల్ జిల్లాలో (Jogulamba Gadwal) అయిజ, గట్టు, ధరూర్ కేటిదొడ్డి, మల్దకల్, గద్వాల మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చిరుజల్లులు పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ​దాదాపు 45 రోజులుగా ఎండ తీవ్రతతో పంట భూములు బీడువారుతుండటంతో రైతాంగం ఆందోళన చెందింది. అటు కృష్ణా నదికి ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడం, ఇటు వర్షాలు పడకపోవడంతో సాగు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో.. శుక్రవారం కురిసిన తేలికపాటి వర్షం అన్నదాతల్లో కొత్త ఆశలను రేకెత్తించింది.

​ఆనందోత్సవాల్లో రైతాంగం

​ఇప్పటికే దుక్కులు దున్ని, విత్తనాలు వేసేందుకు నేలను సిద్ధం చేసుకున్న రైతులు వానదేవుడి రాకకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కురిసిన వర్షం సాగు పనులకు అనుకూలంగా మారడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కరుణతో రానున్న రోజుల్లో మరింత విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>