ఫిఫా ఫైనల్‌కు కొత్త టెన్షన్.. పొగతో పెరిగిన ఆందోళన!

క‌లం, వెబ్ డెస్క్‌: అర్జెంటీనా-స్పెయిన్ ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌ (FIFA World Cup Final) కు కొత్త సవాల్ ఎదురైంది. ఈసారి వర్షం కాదు. కెనడా అడవి మంటల నుంచి వచ్చిన దట్టమైన పొగ నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది. కెనడాలోని అడవి మంటల పొగ న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలను కమ్మేసింది. దీంతో అక్కడ గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. అధికారులు ఆరోగ్య హెచ్చరికలు కూడా జారీ చేశారు. గంటకు మించి బయట ఉండొద్దని ప్రజలకు సూచించారు.

ఆదివారం ఓపెన్ ఎయిర్ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం నిర్వాహకులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అయితే అభిమానులకు ఊరట కలిగించే వార్త కూడా ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. దీంతో పొగ తగ్గి, మ్యాచ్ యథావిధిగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెమీఫైనల్ గెలిచిన తర్వాత స్పెయిన్ జట్టు న్యూజెర్సీ చేరుకుంది. అక్కడే పొగ మధ్య బహిరంగ మైదానంలో సాధన చేసింది.

అయితే మీడియాకు తొలి 15 నిమిషాలు మాత్రమే అనుమతి ఇచ్చారు. మరోవైపు అర్జెంటీనా జట్టు సెమీఫైనల్ తర్వాత అట్లాంటాలోనే ఉంది. ఆ ప్రాంతంపై పొగ ప్రభావం తక్కువగా ఉండటంతో జట్టు ఇబ్బందులు ఎదుర్కోలేదు. శుక్రవారం నుంచి న్యూజెర్సీలో సాధన ప్రారంభించనుంది. వైద్య నిపుణులు మాత్రం ఇలాంటి గాలి పరిస్థితుల్లో బహిరంగంగా శిక్షణ తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పొగలో ఉండే హానికర కణాలు ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ పొగ ప్రభావం స్థానిక క్రీడలపై కూడా పడింది. ఒక మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆటగాళ్లకు అదనపు విరామాలు ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఫిఫా ఫైనల్‌పై ప్రస్తుతం పెద్దగా ఆందోళన అవసరం లేదని అంచనాలు చెబుతున్నాయి. మ్యాచ్ రోజు గాలి నాణ్యత మెరుగుపడే అవకాశాలు ఉండటంతో అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ యథావిధిగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>