కలం, జోగులాంబ గద్వాల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల కష్టాలు మొదలయ్యాయని, సాగునీరు అందించడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ గద్వాల్ (Gadwal) నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు. శుక్రవారం ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు, గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్ల కింద కాలువలను పార్టీ నాయకులు, రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్లను సందర్శించి, ప్రస్తుతం అందులో ఉన్న నీటి సామర్థ్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్తిగా దెబ్బతిన్న జూరాల రైట్ మెయిన్ కెనాల్‌ను వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాలువలను పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఉన్న మహిళా కూలీలను హనుమంతు నాయుడు పలకరించగా.. “మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి” అంటూ నినాదాలు చేశారు.
”గూడ్డెందొడ్డి రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1 టీఎంసీ నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ, నీళ్లు ఇవ్వలేని చేతగాని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జి.రాఘవేంద్ర రెడ్డి, అల్వపాడు ప్రతాప్, శ్రీనివాస్ గౌడ్, సీ.కే. రంగన్న, చిన్నపాడు ఆంజనేయులు, ధర్మ రావు, బీచుపల్లి, లాలప్ప, మోనేశ్ మారోజు, వెంకటేశ్ నాయుడు, జాంపల్లి భరత్ సింహారెడ్డి, కావాలి గోపి, గోవిందు, రాము, రజిని బాబు, నరసింహులు, సుభాష్ రంగారెడ్డి, వెంకటేశ్, రమేశ్, మాలిక్, ప్రవీణ్, కృష్ణ, మోహన్, భీమేశ్, ఆంజనేయులు, నాగేశ్, ఈరన్న, తిమ్మప్ప, రాముడు, మల్లికార్జున్, మహేందర్, నరేశ్, హరికృష్ణ, వీరేశ్, జయన్న, వెంకటప్ప, శివ, నాగరాజు, కళ్యాణ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

