సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు: జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలోని వీరన్నపేట, టీడీగుట్ట బస్తీ దవఖానాలు, మోతినగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరాలు, ఇతర వ్యాధులను నియంత్రించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. సిబ్బంది సమయం పాలన పాటించాలని సూచించారు.

రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైన వ్యాధిగ్రస్తులను గుర్తించి మందులను అందించాలని ఆదేశించారు. జిల్లాధికారి వెంట ఇమ్మ్యూనైజేషన్ అధికారి N. శైలజ, డాక్టర్లు శంకర్, రాజు, ప్రియాంక, సాయి దుర్గ ప్రసాద్‌తోపాటు సుభాష్ చంద్ర, శ్రీనివాసులు, రమేశ్, సిబ్బంది ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>