కలం, వెబ్ డెస్క్: ఏపీలో పెట్టుబడుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు మంత్రి లోకేశ్ (Lokesh) అన్నారు. ఇంకో మూడు సంవత్సరాలు మన నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వెళ్లడం కాదని.. పొరుగు రాష్ట్రాల వారే ఇక్కడకు వస్తారని స్పష్టం చేశారు. ఆ స్థాయిలో పరిశ్రమలను తీసుకొస్తున్నట్లు వివరించారు. రూ.12.56 కోట్ల అమృత్ భారత్ నిధులతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా.. మంగళగిరి స్టేషన్ నుంచి మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
అమరావతి నెంబర్ వన్ సిటీ..
60 ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన హైదరాబాద్ నుంచి 2014లో కట్టుబట్టలతో బయటకు గెంటేశారని మంత్రి లోకేష్ (Minister Lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. తనకు హైదరాబాద్‌లోని ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, ఐటీ టవర్లను చూస్తే అసూయగా ఉంటుందని.. అది తనలో ఇంకా కసిని పెంచిందన్నారు.
దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజధాని పనులను పరుగులు పెట్టిస్తున్నారని వెల్లడించారు.
కుప్పం వారే మంగళగిరికి..
ఒకప్పుడు సీఎం చంద్రబాబు (Chandrababu) సొంత నియోజకవర్గం కుప్పంకు వెళ్లి అభివృద్ధి ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పేవారని మంత్రి లోకేశ్ అన్నారు. కానీ, ఇప్పుడు కుప్పం ప్రజలనే మంగళగిరికి వెళ్లమంటున్నారని.. ఆ స్థాయిలో ఇక్కడ పనులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తాను ఎప్పుడూ కలిసినా.. తన మంగళగిరి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతానని తెలిపారు.
Read Also: ఇస్రోకు ఊహించని షాక్.. అసలు కారణం ఇదేనా?
Follow Us On: X(Twitter)

