కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్‌లో పర్యటించబోతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా మెదిలిన ప్రముఖ కవి దివంగత అందె శ్రీ జయంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా అందె శ్రీ (Andesri) కవితల పుస్తకాలను ఆవిష్కరించి ప్రసంగించబోతున్నారు.
ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను కూడా ఈ సందర్భంగా అందించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకటిన్నర స్థలంలో..
అందె శ్రీ మరణించడానికి కొన్ని నెలల ముందే, ఘట్కేసర్ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసి అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టారు. అది పూర్తి కాకుండానే హఠాన్మరణం చెందారు. ఈ నేపథ్యంలో.. ఆయన ఇంటి నిర్మాణం పూర్తి చేయడంతో పాటు కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా, ఔటర్ రింగ్ రోడ్డ్ సమీపంలో అందె శ్రీ సమాధి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్మృతి వనంగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ అందె శ్రీ రాసిన కవితలు, వెలువరించిన పుస్తకాలు, సమాజం మీద ఆయన అభిప్రాయాలను ఏర్పాటు చేయబోతున్నారు. జయ జయహే తెలంగాణ గీత రాసి.. రాష్ట్రంపై చెరగని ముద్ర వేసిన అందె శ్రీ గొప్ప తనాన్ని భావితరాలకు తెలియజేసే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్మృతి వనం నిర్మాణ బాధ్యతలనే తానే తీసుకున్నారు.
Read Also: కాలేజీలకు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్.. కీలక ఆదేశాలు జారీ!
Follow Us On : WhatsApp

