చిన్నారిపై బ్లేడుతో దాడి ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా బీర్కూర్ లో ఎనిమిది నెలల వైష్ణవిపై బ్లేడుతో దాడి వ్యవహారం (Baby Attack Case ) కొత్త మలుపు తిరిగింది. సతీష్‌ను పెళ్లి చేసుకున్న అక్కా చెల్లెల్ల మధ్య గొడవలే ఘటనకు కారణంగా తెలుస్తుంది. మొదటి భార్యపై అనుమానాలు బలపడుతున్నాయి. రెండో భార్య ఫిర్యాదుతో మొదటి భార్య పై కేసు నమోదైంది. బీర్కూర్‌కు చెందిన టేకు సతీష్ అదే గ్రామానికి చెందిన శైలజను పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు అమ్మాయిలు.

ఏడాదిన్నర కిందట సతీష్ భార్య శైలజ చెల్లెలైన సంధ్యను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 నెలల కిందట కూతురు జన్మించింది. కొన్ని నెలల కిందట నుంచి సతీష్, శైలజ, సంధ్య మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సతీష్, శైలజ కలిసి రెండో భార్య సంధ్యను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆమె ఎనిమిది నెలల కూతురు వైష్ణవిని తమ వద్ద ఉంచుకున్నారు. సంధ్య మాత్రం పుట్టింట్లో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

ఈ నెల 15వ తేదీ తెల్లవారు జామున 4 గంటలకు తండ్రి పక్కన పడుకుని ఉన్న వైష్ణవి కనిపించలేదు. కుటుంబీకులు, బంధువులు కలిసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. స్థానిక గోసంగి సంఘం సమీపంలోని పొదల్లో వైష్ణవి కనిపించింది. చిన్నారి ఒళ్లంతా బ్లేడుతో దాడి చేసిన గాయాలున్నాయి. తన బిడ్డపై అక్క శైలజ బ్లేడ్ దాడి చేసిందని అనుమానం వ్యక్తం చేస్తూ చెల్లె సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రంగంలోకి బాలల సంరక్షణ అధికారులు

బీర్కూర్‌లో వైష్ణవిపై బ్లేడుతో దాడి చేసిన ఘటనను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా బాలల సంరక్షణ అధికారిణి స్రవంతి, జిల్లా ఐసీడీఎస్ పీడీ ప్రసన్న, పర్యవేక్షకురాలు మాధురి కలిసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానంపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి శుక్రవారం వెల్లడిస్తామని, సంరక్షణ బాధ్యత బాధ్యత తాము తీసుకుంటామని ఐడీపీఎస్ అధికారిని స్రవంతి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>