ఏసీబీ వ‌ల‌లో ఇద్ద‌రు ఇరిగేష‌న్ అధికారులు!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ‌లో అవినీతి అధికారుల‌పై ఏసీబీ (ACB) దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ (Adilabad) లో ఇద్ద‌రు ఇరిగేష‌న్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సోనాల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన ఎన్‌వోసీ కోసం బాధితుడు ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ లను సంప్ర‌దించాడు.

అయితే స‌ర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులు అత‌డి వ‌ద్ద లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. నేడు బాధితుడి నుంచి అధికారులు రూ.60 వేల లంచం తీసుకుంటూ ఉండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఇద్ద‌రిని అదుపులోకి తీసుకొని న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఎవ‌రైనా లంచాలు అడిగితే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>