కలం, మహబూబ్నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన జరిగింది. జిల్లా వ్యవసాయాధికారి సక్రియ నాయక్ రైతులకు కీలక సూచనలు ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలైన నువ్వులు, ఆముదం, సజ్జలు, జొన్న, రాగులు, చిరుధాన్యాలు సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో పంటలు పండించుకోవచ్చని తెలిపారు. పతి సాగుపై కూడా అవగాహన కల్పించారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేశ్, సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్, రామ్ రెడ్డి, తిమ్మప్ప, ఆనంద్, మహేశ్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

