పకడ్బందీగా భూముల సర్వే.. కలెక్టర్ కీల‌క ఆదేశాలు

క‌లం, నిర్మ‌ల్‌: భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం భైంసా మండలం బాబుల్ గావ్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యాపులు లేని గ్రామాలకు మ్యాపులు తయారు చేసేందుకు చేపట్టిన సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. రీ సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగించి రీసర్వే ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను మొత్తాన్ని గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏడి ల్యాండ్ సర్వే ల్యాండ్ రికార్డ్ నరసింహ మూర్తి, తహసీల్దార్ శశి భూషణ్, గ్రామ సర్పంచ్ అనసూయ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

యూనిఫామ్ నాణ్య‌త‌తో తయారు చేయాలి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యత‌తో ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా దుస్తుల తయారీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు. సమయానికి యూనిఫాంలు తయారు చేసి విద్యార్థులకు అందించాలని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>