భీమ్‌గల్‌లో నాటు తుపాకుల ముఠా అరెస్ట్

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య(Sai Chaitanya) ఆదేశాల మేరకు సీసీఎస్, భీమ్‌గల్ (Bheemgal) పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా నాటు తుపాకులు పట్టుబడ్డాయి. భీమ్‌గల్ పరిధిలోని దేవక్కపేట్ గ్రామ శివారులో తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి 9 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఆ  ఆయుధాలకు ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్సులు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులతో పాటు ఆయుధాలను మరమ్మతు చేసిన మరో వ్యక్తి రాజును కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో నిందితులు అడవి జంతువులు, వన్యప్రాణులను వేటాడేందుకు ఈ నాటు తుపాకులను ఉపయోగించేవారని వెల్లడైంది. ఇటీవల దేవక్కపేట్ అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతి చెందిన ఘటన నేపథ్యంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో.. తమ వద్ద ఉన్న లైసెన్స్ లేని తుపాకులను అడవిలో దాచేందుకు తరలిస్తుండగా పట్టుబడ్డారని విచారణలో వెల్లడించారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉండటం, ఉపయోగించడం, దాచిపెట్టడం లేదా తరలించడం చట్టరీత్యా నేరమని సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. అక్రమ ఆయుధాల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని భీమ్‌గల్ పోలీసులు ప్రజలను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>