కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) పట్టణంలోని విశ్వనాథ్ పేట్ వైఎస్సార్ కాలనీలో జరిగిన హత్య ఘటన ప్రాథమిక విచారణలో వ్యక్తిగత కారణాల వల్లే జరిగినట్లు గుర్తించినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను కూడా పోలీసులు గుర్తించారని వెల్లడించారు. కేసు దర్యాప్తును పోలీసులు అత్యంత వేగంగా, అన్ని కోణాల్లో సమగ్రంగా కొనసాగిస్తున్నారని, దర్యాప్తు పూర్తయిన అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

