కలం, కరీంనగర్: ఉద్యోగ, కార్మిక వర్గానికి వ్యతిరేకమైన 4 కోడ్స్‌ను రద్దు చేసేంతవరకు ఏఐటీయూసీ (AITUC Karimnagar) ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా సమితి ఐదవ మహాసభలో పలు తీర్మానాలు చేశారు. భవిష్యత్తులో అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం, పెన్షన్ సౌకర్యం, కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్స్ పై భవిష్యత్తులో పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని మహాసభలో నిర్ణయించారు.
అనంతరం జిల్లా నూతన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కాసేట్టి లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షులుగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులుగా జంగా తిరుపతి యాదవ్, బెజ్జంకి కాళిదాస్, కిమ్మసారపు శ్రీనివాస్, వెల్దండి దామోదర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా టేకుమల సమ్మయ్య, సహాయక కార్యదర్శులుగా పిట్టల సమ్మయ్య, డి రజిత, పిట్టల శ్రీనివాస్, కే రజిత, కడారి బీరయ్య, కోశాధికారిగా చిట్ల నిఖిల్ తోపాటు జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులుగా 20 మందిని ఏఐటీయూసీ జిల్లా సమితి ఐదవ మహాసభల్లో ఎన్నుకున్నారు.

