ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి.. ఆదివాసీ ఎరుకల సంఘం

కలం, వెబ్ డెస్క్ : విద్యా ఉద్యోగ ఉపాధి, ఆర్థిక రంగాల్లో ఆదివాసులకు న్యాయం జరిగేందుకు వెంటనే రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ (Hyderabad) దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ను సంఘ అధ్యక్షుడు లోకిని రాజు నేతృతంలో ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి త్వరగతినా ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని హుస్సేన్ నాయక్ ను కోరారు. అనంతరం లోకిని రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సిన హక్కులు, సంక్షేమ పథకాల అమలు, విద్య, ఉపాధి, ఇందిరమ్మ గృహాలు, ట్రైకార్ నిధులు, ప్రభుత్వ భూములు, సామాజిక న్యాయం, ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

అలానే పందులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల కోసం ఎరుకల ఎంపవర్మేట్ స్కీంను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా అనేక విషయాలు అంశాలను కమిషన్ సభ్యుని దృష్టికి తీసుకెళ్లామని వారు కూడా సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కలిసిన వారిలో ఎం వి రమణ, కూతాడి రవికుమార్, కోనేటి నరసింహ, కేతిరి రాజయ్య, సుధాకర్, రవి తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>