కలం, వెబ్ డెస్క్: శేఖర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య గొడవతో డ్యాన్సర్ల అసోసియేషన్ రెండుగా చీలి టాలీవుడ్ (Tollywood)లో రచ్చ జరుగుతోంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో గొడవ మరింత ముదురుతోంది. తమకు రావాల్సిన డబ్బులను డ్యాన్సర్ మాస్టర్లు కాజేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నాన్ లోకల్ పేరిట ఇలా జరుగుతోందని ఓ వర్గం ఆరోపిస్తోంది.
దీన్ని డ్యాన్సర్ల ప్రెసిడెంట్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఖండించారు. సెక్రటరీ శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కో–ఆర్డినేటర్లు, ఇన్‌ఛార్జులే దోచుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. తాము ఎన్ని సార్లు లెక్కలు అడిగినా.. ఇవ్వలేదని తెలిపారు.
రాజీనామాలతో మొదలై..
సుమలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డ్యాన్స్ అసోసియేషన్ సభ్యుల్లో పది మంది రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు పెట్టాలని పట్టుబట్టారు. ఇక్కడే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మద్దతుదారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇది కాస్తా పెద్దది కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కల్పించుకుని.. ఇద్దరిని పిలిపించుకున్నారు. సమస్యను అడిగి తెలుసుకున్న చిరంజీవి.. ఫిలిం ఫెడరేషన్ వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం, రెండు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
Read Also: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్!
Follow Us On: X(Twitter)

