కలం, జోగులాంబ గద్వాల: నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. మంగళవారం జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కెవి ఉపకేంద్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు.
అలాగే ఎర్రవల్లి (Erravalli) మండల కేంద్రం వద్ద రూ.155 కోట్ల నిధులతో 220/132/33 కెవి ఉపకేంద్రం నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం రూ.376.25 కోట్ల విలువైన విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు విజయుడు, చిక్కుడు వంశీకృష్ణ, శంకర్, అనిరుద్ రెడ్డి, గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్, అధికారులు, జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: పార్టీ నేతల సోషల్ మీడియాపై ఏఐసీసీ ఆరా!
Follow Us On: Instagram

