కలం, వెబ్ డెస్క్: సింగరేణి సంస్థను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని.. సింగరేణి ప్రాంత ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన “సింగరేణి భరోసా యాత్ర” (Singareni Bharosa Yatra) తాడిచెర్లకు చేరుకున్న సందర్భంగా అక్కడి మీడియాతో ఎంపీ మాట్లాడారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు గొప్ప వరం బొగ్గు గనులు అని కొనియాడారు. యావత్ దేశానికి సింగరేణి వెలుగునిస్తోందని చెప్పుకొచ్చారు. దాదాపు వంద ఏళ్ళ నుండి లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని కొనియాడారు. ఒకనాడు లక్షా 20 వేల మంది కార్మికులు ఉన్నారని.. ఇప్పుడు 40 వేల మంది కార్మికులకు పడిపోయి వెలవెలబోతుందని చెప్పారు.
సింగరేణిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ (PM Modi) తాడిచెర్ల మైన్ ను సింగరేణికి కేటాయించారని ఈటల (Eatala Rajendar) వ్యాఖ్యానించారు. దీనికి కృషిచేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. గత రాష్ట్ర పాలకులు సింగరేణి బలహీనపరిచారని మండిపడ్డారు. బీజేపీ తరఫున సింగరేణి సంస్థను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు.
Read Also: హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఇళ్లపై ఏసీబీ దాడులు
Follow Us On: Sharechat

