ఆగ్రాలో వింత ఘటన.. ఫ్రిజ్‌లో మంచు శివలింగం

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో(Agra) చోటుచేసుకున్న ఓ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఏర్పడిన మంచు ఆకారం శివలింగాన్ని(Fridge Ice Shivling) పోలి ఉండడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఫ్రిజ్‌లో సహజంగా ఏర్పడిన ఈ మంచు ఆకారాన్ని కొందరు అమర్‌నాథ్ గుహలోని పవిత్ర మంచు శివలింగంతో పోలుస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో ఆ ఇంటి వద్దకు భక్తుల రాక పెరిగింది.

ఈ మంచు ఆకారం వద్ద భక్తులు పూజలు, హారతులు నిర్వహిస్తూ పూలు, పాలు, స్వీట్లు వంటి నైవేద్యాలను సమర్పిస్తున్నారు.  ఇటీవల అమర్‌నాథ్ యాత్రలో మంచు లింగం పరిమాణం తగ్గిందన్న వార్తల నేపథ్యంలో, ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం వచ్చిందని పలువురు చెబుతున్నారు. ఇంటి యజమాని కూడా దీనిని భగవంతుడి అనుగ్రహంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే కొందరు నెటిజెన్స్ ఇది ఫ్రీజర్‌లో నీరు గడ్డకట్టే సాధారణ ప్రక్రియలో ఏర్పడే ఆకారమని.. సహజంగా ఏర్పడిన ఆకృతుల్లో మనకు పరిచయమైన రూపాలను చూడటం వల్ల  ఇలాంటి భావనలు కలుగుతాయని పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>