చికెన్ షాపులో లేడి కిలాడీ.. క్షణాల్లో మాయం!

కలం, దమ్మపేట: చికెన్ రేట్లు పెరుగుతున్నాయని అనుకుందేమో.. దుకాణానికి వచ్చిన ఒక మహిళ రెండు కిలోల చికెన్ కొనుగోలు చేసి, ఏకంగా పది కిలోల చికెన్ కాజేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులతో కలిసి మహిళ దమ్మపేట (Dammapeta)లోని ఒక చికెన్ దుకాణానికి వచ్చి రెండు కేజీల చికెన్ ఆర్డర్ ఇచ్చింది. దుకాణ యజమాని చికెన్ ప్యాక్ చేసి ఇవ్వగా.. తీసుకోకుండా యజమానితో ముచ్చట్లు పెట్టారు. గిరాకీ లేకపోవడంతో ఆయన సైతం వారితో ముచ్చట్లలో పడిపోయాడు.

ధ్యాస మరల్చి.. చేతివాటం..

ఇదే సమయంలో స్థానిక హోటల్ నిర్వాహకుల కోసం అంతకుముందే సిద్ధం చేసిన పది కిలోల చికెన్ క్యారీ బ్యాగ్‌ను కూడా యజమాని అదే టేబుల్‌పై ఉంచాడు. దీనిపై కన్నేసిన సదరు మహిళ, దుకాణదారుడి ధ్యాస మరల్చింది. ముందు తాను కొన్న చికెన్ డబ్బులను యజమానికి ఇచ్చి, ఆయన డబ్బులను కౌంటర్‌లో దాచుకునే లోపు.. టేబుల్‌పై ఉన్న పది కిలోల చికెన్ బ్యాగ్‌ను చాకచక్యంగా దొంగిలించి అక్కడి ముగ్గురు ఉడాయించారు.

కొద్దిసేపటి తర్వాత హోటల్ ఆర్డర్ మాయమవ్వడాన్ని గమనించిన యజమాని, సీసీ కెమెరాలను పరిశీలించగా మహిళ చేతివాటం బయటపడింది. ప్రస్తుతం ఈ చికెన్ దొంగతనం వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>