పీసీసీ చీఫ్ సెగ్మెంట్.. సర్ ప్ర‌క్రియ‌తో జాగ్రత్త!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్‌లు, బీఎల్‌వో సూపర్‌వైజ‌ర్ల‌కు సర్ (SIR) ప్రక్రియ పై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కేశ వేణు, సర్ అర్బన్ కో ఆర్డినేటర్ ఆకుల లలిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బ‌న్‌లో సర్ ప్రక్రియ పూర్తిస్థాయిలో అయ్యే విధంగా చూడాలని, పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ కష్టపడి పని చేయాలని సూచించారు.

డివిజ‌న్‌ల వారీగా మెంటర్‌ల‌ను నియమించామని, డివిజన్‌లో ఒక్క ప్ర‌దేశాన్ని ఎంచుకొని పార్టీ నాయకులంతా క‌లిసి కూర్చొని ఓటర్లకు ఫార్మ్ నింపడంలో సహాయం చేయాల‌ని బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) చెప్పారు. క్యాంపులు నిర్వహించి, ప్రతి డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి ఫార్మ్ తీస్కొని నింపడానికి వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. కంటెస్టెడ్‌ కార్పొరేటర్లు, బీఎల్‌వో సూపర్‌వైజ‌ర్లు తమ తమ డివిజన్‌ల‌లో వాలంటీర్ల స‌హాయంతో ఇంటికి వెళ్లి ఓటర్లకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్రమ్, అర్బన్ ఈఆర్వో కో ఆర్డినేటర్ అబ్దుల్ వహీద్, డీసీసీ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విజయ్ పాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read Also: ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>