కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ చేయడం ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణాల్లో అనేక లోపాలున్నాయని 2024 అక్టోబరులో రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రస్తుతం నీటి నిల్వకు ఏమాత్రం అనుకూలంగా లేదని తేల్చి చెప్పారు. అలా కాకుండా నీరు నిల్వ చేస్తే మాత్రం గేట్లతో సహా ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందన్నారు.
నీరు నిల్వ ఎలా చేస్తారు..?
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఇక నుంచి ఏదీ చేయాలన్నా కేంద్ర జలసంఘం సూచనలే ప్రామాణికంగా తీసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో కూడా అనేక లోపాలున్నాయని కూడా చెప్పిందన్నారు. గేట్లు మూసివేయకుండా నీరు ఎలా నిల్వ చేస్తారని.. నిల్వ చేస్తే మూడు బ్యారేజీల పరిస్థితేంటని ప్రశ్నించారు.
కనీసం ప్రతి చోట అయిదారు టీఎంసీలను నిల్వ చేస్తేనే ఎత్తిపోతల సాధ్యమవుతుందని.. అసలు నిల్వ చేయొద్దని NDSA ప్రాథమిక, తుది రిపోర్టులో స్పష్టంగా పేర్కొందన్నారు. అంతే తప్ప, ఖిలాడీ కమిటీలను పట్టించుకోవద్దని సూచించిందన్నారు.
బీఆర్ఎస్ కుట్రలో భాగం కావొద్దు..
కన్నెపల్లి (Kannepalli) నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చేస్తున్న కుట్రను కొంత మంది రిటైర్డ్ ఇంజినీర్లు సమర్థించడం సరికాదని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. కాళేశ్వరం విషయంలో వారి చేసిన తప్పులను తమను చేయమంటున్నారని మండిపడ్డారు.
బ్యారేజీలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వమే ఒక కమిటీని నియమించిందని గుర్తు చేసిందన్నారు. ప్రాజెక్ట్ నడిపే విషయంలో రాష్ట్రం ఏమాత్రం తొందరపాటు చర్యలు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పిందన్నారు.
Read Also: రాష్ట్రంలో ఇదే పెద్ద సమస్య: సీఎం రేవంత్
Follow Us On: Instagram

