కలం, వెబ్ డెస్క్: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో (Vietnam Boat Accident) తెలంగాణకు చెందిన సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా ఓ మొబైల్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందించేందుకు వెంటనే కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ పరిపాలనా శాఖలోని ఎన్ఆర్ఐ విభాగానికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వివరించింది.
కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు..
9885371189, 7997959754, 9989654807, 7997959779 ఫోన్ నెంబర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం అందించడానికైనా.. సహాయక చర్యల వివరాలను తెలిపేందుకు ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.
Read Also: మోటార్లకు మీటర్ల అంశం.. రైతులకు సర్కార్ గుడ్ న్యూస్
Follow Us On: Instagram

