సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే!

కలం, వెబ్ డెస్క్: ఇందిరమ్మ క్యాంటీన్ల గురించి వస్తున్న స్పందన చూసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘ఎవరో శ్రమజీవి.. ఎప్పుడూ చూడలేదు.. ఎన్నడూ కలవలేదు.. కానీ ‘ఆకలి తీర్చారు’ అంటూ ఆ యువకుడు చెప్పిన ఒక్క మాట, తెలిపిన అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో పుట్టిన ఆలోచనే ఇందిరమ్మ క్యాంటీన్లు. మీ కడుపు నిండిన తృప్తి, మీ ముఖంలో చిరునవ్వు.. మీ అన్నగా నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది?.. కష్టజీవుల గుండెల్లో నుంచి వచ్చే ఇలాంటి ఆదరణే, ప్రజల కోసం మరిన్ని సంక్షేమ అడుగులు ముందుకు వేయడానికి నాకు మరింత స్ఫూర్తిని, బలాన్ని ఇస్తాయి’ అని సీఎం పేర్కొన్నారు.

యువకుడి వీడియోకు సీఎం స్పందన..

హైదరాబాద్‌లో ర్యాపిడో బైక్ నడుపుకునే ఓ వ్యక్తి తనకు ఇందిరమ్మ క్యాంటీన్ ఎలా ఉపయోగపడుతుందో చెబుతూ వీడియో తీశాడు. ‘రూ.40తో టిఫిన్ చేయాలంటే మనసు రావడం లేదు. అదే ఇందిరమ్మ క్యాంటీన్‌లో కేవలం రూ.10కు ఆరు ఇడ్లీలు అందిస్తున్నారు. ఎంతో మంది ఆటో డ్రైవర్లు, కార్మికులు రోజూ ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. ఇలాంటి క్యాంటీన్లు పెట్టి, ఎంతో మంది ఆకలి తీర్చుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఇది గొప్ప విషయం’ అని ప్రశంసించాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. సీఎం రేవంత్ స్పందించి ఎమోషనల్ కామెంట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>