రైతులకు పది రోజులలో సాగునీటి అందిస్తాం: ఎమ్మెల్యే కుంభం

కలం, వలిగొండ: ధర్మారెడ్డిపల్లి కాలువ రైతులకు మరో 10 రోజులలో సాగు నీరు అందిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా ధర్మారెడ్డిపల్లి (Dharmareddypally) కత్వ గేట్ల నిర్మాణాన్ని, కాల్వపనులను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం ఆయన (Anil Kumar Reddy) మాట్లాడుతూ.. ధర్మారెడ్డి పల్లి కాల్వ పనులకు రూ. 125 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో పనులు పూర్తి అవుతాయని అన్నారు. రైతు క్షేమమే ప్రజాపాలన లక్ష్యమని స్పష్టం చేశారు. గత పాలకులు 10 ఏండ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. ధర్మారెడ్డి పల్లి కాల్వ ద్వారా పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల మండలాలలోని వందలాది మంది రైతుల వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.

Read Also: బీఆర్ఎస్‌కు భరోసా లేదు.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>