నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet) కీలక సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి పనులను వేగవంతం చేయడం, సీఆర్డీఏ పరిధిలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు (యాన్యుటీ) చెల్లింపుపై ఈ భేటీలో మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది.

అంతేకాదు ట్రంక్ రోడ్లు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా తమ సొంత ఇళ్లు, భూములు కోల్పోయిన రాజధాని ప్రాంత బాధితులకు ప్రభుత్వం అండగా నిలవనుంది.వారికి రెంటల్ అలవెన్స్ ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు కొత్త ల్యాండ్ పూలింగ్ గ్రామాల పరిధిలోని రైతులకు మంత్రిమండలి సరికొత్త తీపి కబురు అందించబోతోంది. ప్రాజెక్టుల కోసం భూములు అందించిన రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ వర్తింపజేసే ఫైలుపై సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.రాజధాని అమరావతి కోసం త్యాగాలు చేసిన రైతులకు న్యాయం చేయడమే కాకుండా,రాజధాని అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఉండబోతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>