కలం, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక కౌన్సిలర్ సంపత్ రాజ్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ మేరకు స్టేషన్ ఘన్‌పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) వేణు వివరాలను వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, ఆరోపణలను పరిశీలించి సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, విచారణలో తేలే నిజానిజాలు, లభించే ఆధారాలను బట్టి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వేణు పేర్కొన్నారు.

