Mobile Popup Ad
Mobile Popup Ad

పదో తరగతి దివ్యాంగ విద్యార్థుల వివరాలు పంపండి.. నిర్మల్ డీఈఓ

కలం, నిర్మల్: పదో తరగతి దివ్యాంగ విద్యార్థుల వివరాలు వెంటనే పంపాలని నిర్మల్ డీఈఓ (Nirmal DEO) దర్శనం భోజన్న అధికారులను ఆదేశించారు. 2027 మార్చి ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న దివ్యాంగ విద్యార్థుల వివరాలను ఈ నెల 15లోగా అందించాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థుల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా–1లో పూర్తిచేసి, విద్యార్థుల వైద్య ధ్రువీకరణ పత్రంతోపాటు జిరాక్స్ ప్రతిని అందించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్ణీత సమయంలోపు సమర్పించాలన్నారు.

2027 మార్చిలో జరుగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు కొన్ని మినహాయింపులు ఉంటాయన్నారు. అదనపు సమయం, స్క్రైబ్ వంటి ప్రత్యేక రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>