ఖమ్మంలో ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో ఆర్టీసీ బస్సు సిబ్బంది సమయస్ఫూర్తి ప్రదర్శించి మహిళ ప్రాణాలు కాపాడారు. కోదాడ నుంచి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తన భర్తతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఊపిరి ఆడక ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది.

గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్ ఆలస్యం చేయకుండా నేరుగా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో మహిళకు ప్రాణాపాయం తప్పింది. వేగంగా స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను ప్రయాణికులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>