Mobile Popup Ad
Mobile Popup Ad

ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు

కలం, నిజామాబాద్ బ్యూరో : డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లి గ్రామంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ రైతులకు ఆయిల్ పామ్ పంటపై (Oil Palm Cultivation) అవగాహన కల్పించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో PREUNIQUE ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో సోమవారం సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఉద్యాన శాఖ నుండి మోర్తాడ్ డివిజన్ ఉద్యాన అధికారి రాజు రైతులకు పలు సూచనలు చేశారు. కొత్తగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలి అని, ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు సంతోషంగా దిగుబడులు తీస్తున్నట్టు వివరించారు. కార్యక్రమానికి నూత్ పల్లి సర్పంచ్ రాజా రెడ్డి, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్త గోపిడి గంగారెడ్డి, AEO గంగాధర్, గ్రామ రైతులు తదితరులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>