సదాశివపేటలో లారీ బీభత్సం.. ఒకరు మృతి

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సదాశివపేట (Sadasivpet)  మండల కేంద్రంలో లారీ బీభత్సం సృష్టించింది. నిజాంపూర్ బైపాస్ రోడ్డుపై హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళుతున్న లారీ , రోడ్డు క్రాస్ చేస్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాక్టర్, మ‌రో మూడు బైకులను బ‌లంగా తాకింది. ఈ ప్రమాదంలో రమేష్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మ‌రో న‌లుగురికి గాయాల‌య్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>