Mobile Popup Ad
Mobile Popup Ad

ఫాసిజం ప్రత్యేకతలపై జూలై 5న సదస్సు

కలం, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆవిర్భావ దినం సందర్భంగా దేశంలో ప్రజా పోరాటాలపై అమలవుతున్న ఫాసిస్ట్ (Fascism Seminar) నిర్బంధానికి, అణిచివేతకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పోరాటం కొనసాగించాలానే నేపథ్యంతో సదస్సు ఏర్పాటు చేశారు. 2026 జూలై 5 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఫాసిజం ప్రత్యేకతలు, బుల్డోజర్ రాజకీయాలు మత, మైనారిటీల అస్తిత్వంపై దాడి, తెలుగు సాహిత్యంలో ఇటీవల ధోరణులు – మార్క్సిస్ట్ దృక్పథం అనే అంశాలపై ఉపన్యాసాలు నిర్వహించనున్నారు.

అలాగే విరసం కళాబృందం నాటక ప్రదర్శనతో పాటు వివిధ కళాబృందాల ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా విరసం సిటీ యూనిట్ కరపత్రాన్ని, పోస్టర్లను ఆవిష్కరించారు. ‘మిత్రులందరికీ సాదర ఆహ్వానం.. ఎప్పటిలాగానే మీ స్నేహపూర్వక సహకారాన్ని ఆశిస్తూ అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నాం’ అని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భూపతి (తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం), విరసం సభ్యులు రాము, శివరాత్రి సుధాకర్, రాంకి, శశిధర్, నారాయణ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>