నాగార్జునసాగర్ భద్రతపై ఎస్పీతో SPF అధికారుల భేటీ

కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు (Nagarjuna Sagar SPF) గురువారం నల్గొండ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవర్‌ను జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాగార్జునసాగర్ ఎస్‌పీ‌ఎఫ్ విభాగం అసిస్టెంట్ కమాండెడ్ బి.రాజు ఆధ్వర్యంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను కలిశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎస్‌పీ‌ఎఫ్ విభాగం అసిస్టెంట్ కమాండెంట్ (Nagarjuna Sagar SPF) బి.రాజు మాట్లాడారు. నాగార్జునసాగర్ డ్యాం, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో భద్రత నిర్వహణలో జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారన్నారు. ఎస్పీని కలిసినవారిలో సాగర్ డ్యాం ఎస్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, జెన్‌కో ఎస్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ గౌడ్ ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>