లండ‌న్‌లో అనుమానాస్ప‌దస్థితిలో కామారెడ్డి యువ‌కుడి మృతి..!

కలం, నిజామాబాద్ బ్యూరో: లండన్‌ (London)లో కామారెడ్డి (Kamareddy) జిల్లాకు చెందిన యువ‌కుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి (25) (Srinath Reddy) అనే యువకుడు ఎం ఎస్ చదవడానికి 14 నెల‌ల‌ క్రితం లండన్‌కు వెళ్లాడు. భారత కాలమాన ప్రకారం మొన్న రాత్రి ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం వెళ్లి ఫ్రెండ్ రూంలో నిద్రించాడు. త‌రువాతి రోజు ఉద‌యం (నిన్న) చూసేసరికి శ్రీనాథ్ రెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు. శ్రీనాథ్ రెడ్డి లీ సెస్టర్ స్క్వేర్ పట్టణంలో యూనివర్సిటీలో ఎం ఎస్ ఫస్ట్ ఇయర్ పాసై ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. శ్రీనాథ్ రెడ్డి మృతి చెందాడ‌ని స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

శ్రీనాథ్ రెడ్డి తలమడ్ల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి-మంజుల దంపతుల కుమారుడు. శ్రీనాథ్ రెడ్డి (Srinath Reddy) ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధిస్తాడనుకున్న తల్లిదండ్రులకు కొడుకు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. యువ‌కుడి మృతితో త‌ల‌మ‌డ్ల‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. సంఘటన గురుంచి అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్న‌ట్లు తెలిసింది.

Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>