మాకు పంచాయతీలు వద్దు.. పరిష్కారం కావాలి: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కరువు జిల్లాలకు తుంగభద్ర ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపబోతుందని సీఎం రేవంత్ (CM Revanth) స్పష్టం చేశారు. కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్లను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రాజెక్టుతో మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని చెప్పారు. నీటి సమస్యలు పరిష్కరించకపోవడం వలన నీరు సముద్రం పాలవుతోందని చెప్పారు. తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని చెప్పారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్న ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు అని అభివర్ణించారు. తమ ప్రభుత్వానికి పంచాయతీలు వద్దని.. సమస్యకు పరిష్కారం కావాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>